జెండా వందనంతో సరిపెట్టుకోవద్దు.. - cp
కుల మతాలకు అతీతంగా దేశ పౌరులంతా కలిసిమెలసి ఉండాలని కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు. రామడుగు మండలంలో ఆయన జెండా వందనం చేశారు.

జెండా వందనం చేసిన సీపీ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో నిత్య జనగణమన నూట పదవ రోజున పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి హాజరై జెండా వందనం చేశారు. సామాజిక రుగ్మతలు అధిగమించిన నాడే దేశం పటిష్టంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం జెండా వందనంతో సరిపెట్టుకోకుండా దేశభక్తిని చాటే కార్యక్రమాలను యువత చేపట్టాలని సూచించారు.
జెండా వందనం చేసిన సీపీ