తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad By Election 2021: ఆదరబాదరాగా వస్తున్నారు.. ఉసూరుమంటూ వెళ్తున్నారు... - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్​ గోయల్

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా అభ్యర్థులు, ఏజెంట్లు, డ్రైవర్లు, కార్యకర్తలు 2 డోసుల టీకా తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్​ గోయల్ (State Chief Electoral Officer Shashank Goyal) ఇప్పటికే స్పష్టం చేశారు. రెండో డోసు కొవిడ్​ టీకా వేసుకోవాలనే నిబంధన (Covid Vaccine two-dose rule) తప్పనిసరి కావడంతో... హుజూరాబాద్​ ఉపఎన్నిక (Huzurabad By Election 2021)లో పోటీ చేయాలనుకునే వారికి ప్రతిబంధకంగా మారుతోంది.

Huzurabad By Election 2021
హుజూరాబాద్​ ఉపఎన్నిక

By

Published : Oct 6, 2021, 6:50 AM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక (Huzurabad By Election 2021)లో పోటీ చేయాలనుకునే వారిని నామినేషన్‌ కార్యాలయం వెలుపలే పోలీసులు నిలువరిస్తున్నారు. వారి దగ్గర రెండు కొవిడ్​ టీకా రెండు డోసులు (Covid Vaccine two-dose rule) వేయించుకున్నట్లు తెలిపే ధ్రువీకరణ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి స్వతంత్ర అభ్యర్థులు (Huzurabad By Election 2021)గా పోటీచేద్దామనుకున్న వారిని బలపరిచేందుకు 10 మంది చొప్పున రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు దొరకడం కష్టంగానే మారింది.

ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో నామినేషన్లు (Huzurabad By Election 2021) వేయాలని నిరీక్షిస్తున్న ఉపాధి హామీ క్షేత్రసహాయకులు, నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం బరిగె గట్టయ్య అనే వ్యక్తి 10 మంది మద్దతుదారులను తీసుకుని రాగా.. రెండో డోసు పూర్తయితేనే నామినేషన్‌ (Huzurabad By Election 2021)కు అవకాశమిస్తామంటూ పోలీసులు వెనక్కి పంపారు. తనను (Huzurabad By Election 2021) నామినేషన్‌ వేయనీయకుండా రిటర్నింగ్‌ అధికారి, సిబ్బంది కాలయాపన చేశారని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లింగయ్య ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో రెండో డోసు వేసుకున్న వారు 40శాతం దాటి లేకపోవడంతో మద్దతుదారుల కొరత ఎదురవుతుంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌. రవీందర్‌రెడ్డి (Rdo Ravinder Reddy) మాట్లాడుతూ.. ఆర్వో కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకొని ఉండాలన్నారు. కొవిడ్ నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details