తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో కోవిడ్ పరీక్షా సెంటర్ - కరీంనగర్​ తాజా వార్త

కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లోను విస్తరిస్తుండటం వల్ల ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కోవిడ్​ పరీక్షా కేంద్రాలను వికేంద్రీకరిస్తోంది. కరోనా కేసులు అధికంగా ఎక్కడ బయటపడుతున్నాయో ఆయా ప్రాంతాల్లో కోవిడ్​ పరీక్షల కోసం శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కరీంనగర్​లోనూ ఓ పరీక్షా కేంద్రం సిద్దమవుతోంది. అక్కడ ఏర్పాటు చేయబోయే సదుపాయాల గురించి జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ రవింద్రారెడ్డితో మాప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి...

covid testing center available karimnagar
ఒకేసారి 16 కొవిడ్​ టెస్టులు... నాలుగు జిల్లాలకు అందుబాటు

By

Published : Jun 6, 2020, 4:20 PM IST

  • కరీంనగర్​లో ఏర్పాటు చేయబోతున్న పరీక్ష సెంటర్​ ప్రత్యేకత ఏంటి?

కరీంనగర్​ పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల జిల్లా ఇలా నాలుగు జిల్లాలకు ఈ పరీక్ష సెంటర్​ సేవలందించనుంది. సీబీనాట్​ బేసడ్​ టెస్టింగ్​ సెంటర్​ ఏర్పాటు కానుంది. త్వరగా పరీక్ష పూర్తవుతుంది. ఫలితం క్లారిటీగా వస్తుంది. ఇందులో ఒకే సారి 16 టెస్టులు చేసే అవకాశం ఉంది.

  • ఈ పరీక్షా సెంటర్​లో ఎంత మంది సేవలందించనున్నారు.. వారు ఏమైనా ట్రైనింగ్​ తీసుకున్నారా?

ఒక మైక్రోబైయాలజిస్ట్​ ఇద్దరు ల్యాబ్​ టెక్టీనిషియన్స్​ ఇద్దరు హైదరాబాద్​లో ట్రైనింగ్​ తీసుకుని పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నారు.

  • కరీంనగర్​లో ఈ కేంద్రం ఏర్పాటు చేయడానికి గల కారణాలేంటి?

హైదరాబాద్​లో అధిక సంఖ్యలో పరీక్షలు చేయాలంటూ నమూనాలు వెళ్తుండం వల్ల ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

  • శాంపిల్​ సేకరించేటప్పుడు వైరస్​ వ్యాప్తి చెందకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు?

ముందుస్తు జాగ్రత్తులు తీసుకునే శాంపిల్స్​ను సేకరిస్తాం... అందరూ పీపీఈ కిట్లు సహాయంతో డబ్యూహెచ్​వో నిబంధనల ప్రకారమే తగు జాగ్రత్తలు పాటించి పరీక్షలు నిర్వహిస్తారు.

ఒకేసారి 16 కొవిడ్​ టెస్టులు... నాలుగు జిల్లాలకు అందుబాటు

ఇవీ చదవండి:'ఏడాది పాలనలో అప్పులు తప్ప.. అభివృద్ధి శూన్యం'

ABOUT THE AUTHOR

...view details