తెలంగాణ

telangana

ETV Bharat / state

పలెల్లో కొవిడ్​ కట్టడి చర్యలు... గ్రామాల్లో ఐసోలేషన్​ కేంద్రాలు

గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ కట్టడికి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణాలపై దృష్టి పెట్టిన యంత్రాంగం.. ఇప్పుడు పల్లెల్లో మహమ్మారిని అరికట్టేందుకు సమాయత్తమవుతున్నారు. గ్రామాల్లో 5 కంటే ఎక్కువ పాజిటివ్​ కేసులు ఉంటే ఐసోలేషన్​ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్న కలెక్టర్​ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana news
కరీంనగర్​ వార్తలు

By

Published : Jun 6, 2021, 12:13 PM IST

కరీంనగర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కలెక్టర్​ ఆదేశాలపై అధికారులు ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్​ గ్రామీణ మండలం దుర్శేడు గ్రామంలో తొలి ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటైంది. మండల స్థాయిలో అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన కలెక్టర్ శశాంక ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలోని చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, కొత్తపల్లి, మానకొండూరు, రామడుగు, తిమ్మాపూర్‌, హుజూరాబాద్‌, ఇల్లందకుంట మండలాల పరిధిలో 38 గ్రామాల్లో కేసులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో కేసులను బట్టి తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.

గ్రామాల్లో పాఠశాలలను ఐసోలేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయా కేంద్రాల్లో వైద్య సదుపాయాలతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో కొవిడ్ పాజిటివ్ రేటు 31 నుంచి 7.5 శాతానికి తగ్గిందని తెలిపారు. మార్కెట్ యార్డ్, బస్టాండు, జనసాంద్రత ఎక్కువగా ఉన్నచోట మొబైల్ టీంల ద్వారా కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

ABOUT THE AUTHOR

...view details