లోకసభ ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్‌తోనే మొదలవుతుందని కరీంనగర్ రిటర్నింగ్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఏకకాలంలో లెక్కిస్తామన్నారు. ప్రతి సెగ్మెంట్లో 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ చెప్పారు. అన్ని సెగ్మెంట్లలోని లెక్కింపు వివరాలు తీసుకొని రిటర్నింగ్ అధికారి రౌండ్ల వివరాలు ప్రకటిస్తారన్నారు. లాటరీ పద్ధతిన ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు.
లెక్కింపు ప్రక్రియకు కరీంనగర్ సిద్ధం - counting-yerpatlu-colector
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 23 జరగనున్న దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఏకకాలంలో ఓట్లను లెక్కించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు రిటర్నింగ్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.
లెక్కించేందుకు సర్వం సిద్ధం
TAGGED:
counting-yerpatlu-colector