మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని స్థానిక ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఒకేసారి 5 డివిజన్ల కౌంటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలి: శశాంక - latest news on collector shashanka
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఓట్ల లెక్కింపుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
![ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలి: శశాంక](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
కౌంటింగ్ టేబుళ్లు, ఆర్వో టేబుళ్లు డివిజన్ల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ఏజెంట్లకు ప్రత్యేక బార్‌కోడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపునకు ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించాలని.. పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలి: శశాంక