కరీంనగర్లో ప్రశాంతంగా ప్రాదేశిక ఓట్ల లెక్కింపు - COUNTING
కరీంనగర్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు అనంతరం జడ్పీటీసీ ఓట్లను లెక్కించనున్నారు.
కరీంనగర్లో ప్రారంభమైన ప్రాదేశిక ఓట్ల లెక్కింపు
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ ఆదర్శ పాఠశాలలో ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. జిల్లా రెవెన్యూ అధికారి బిక్ష నాయక్ పర్యవేక్షణలో 1500 మంది సిబ్బంది బ్యాలెట్ పత్రాల లెక్కింపులో నిమగ్నమయ్యారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఉదయం 10 గంటల నుంచి ఎంపీటీసీ స్థానాలకు బ్యాలెట్ లెక్కింపు అనంతరం జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు.
TAGGED:
COUNTING