అవినీతికి పాల్పడితే ఎంతటి వారిపైన అయిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లాలో రవాణాశాఖ ఎన్ఫోర్స్మెంట్అధికారిగా విధులు నిర్వహిస్తున్న గౌస్ పాషాపై ఆరోపణలు రావడంతో... కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తున్నట్లు తెలిపారు. అన్ని ఆధారాలతో ఫిర్యాదు రాగా... గౌస్ పాషాపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీటీసీ చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన కోరారు. పాదచారులు, సైకిలిస్టులు తప్పకుండా రోడ్డు దాటుతున్నపుడు ఇరుపక్కల గమనించాలని సూచనలు చేశారు.
అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదు - ట్రాన్స్పోర్టు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాహన తనిఖీ అధికారిపై కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అతన్ని కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తున్నట్లు తెలిపారు.
అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదు