కరీంనగర్ 36వ డివిజన్లో మేయర్ సునీల్ రావు చేతుల మీదుగా కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ 150 మంది పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి తమ వంతు బాధ్యతగా పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. పేదల ఆకలి తీరుస్తున్న కార్పొరేటర్‌ను మేయర్ అభినందించారు.
అన్నార్తులకు అండగా దాతలు - Corporator Jaya sri Distributes of lunch packets
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సాయం చేయటానికి దాతలు ముందుకొస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో 36వ డివిజన్లో కార్పోరేటర్ 150 మంది పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.
భోజన ప్యాకెట్ల పంపిణీ
ఈ నెల 31 వరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ... వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని విజ్ఞప్తి చేశారు.