హోలీ వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ కార్పొరేటర్ నుజత్ అలీ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రంగుల పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నాలుగో డివిజన్ కార్పొరేటర్ కోళ్లు పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ వినూత్న హోలీ కానుక - తెలంగాణ వార్తలు
హోలీ పండుగను పురస్కరించుకొని కరీంనగర్లోని పారిశుద్ధ్య కార్మికులకు ఓ కార్పొరేటర్ వినూత్న కానుకలు ఇచ్చారు. పండుగ ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ కోళ్లను పంపిణీ చేశారు. కరోనా వేళ వాళ్లు నిర్విరామంగా కృషి చేస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారని అన్నారు.
హోలీ కానుకలు, పారిశుద్ధ్య కార్మికులకు హోలీ కానుకలు
కరోనా సమయంలోనూ నగరంలోని 60 డివిజన్లలో కార్మికులు నిర్విరామంగా పని చేస్తున్నారని అన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నందున ఈ కార్యక్రమం చేపట్టినట్లు కార్పొరేటర్ నుజత్ అలీ తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా సాకుతో వినియోగదారులపై ధరాభారం