తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona : ఐసోలేషన్​లో బోర్ కొడుతోందని బయటకొచ్చిన కరోనా రోగులు - corona patients roaming in roads at karimnagar

కరోనాతో ఇంట్లో ఉండలేక బోర్ కొడుతోందని ఇద్దరు యువకులు రోడ్లపైకి వచ్చారు. లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి రావడంతో పోలీసులు ఆరా తీయగా.. విషయం తెలిసి కంగుతిన్నారు.

corona patients come out side for feel bored in isolation at karimnagar
బోర్ కొడుతోందంటూ.. బయటకొచ్చిన కరోనా రోగులు

By

Published : May 30, 2021, 1:40 PM IST

కరీంనగర్ నాకా చౌరస్తా వద్ద చోటు చేసుకున్న ఘటనతో పోలీసులు అవాక్కయ్యారు. లాక్​డౌన్ సడలింపు సమయం ముగిసాక రోడ్లపై తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడకు ఎందుకు వచ్చారని పోలీసులు వారిని ఆరా తీయగా... అందులో ఒక యువకుడు ఐసోలేషన్​లో బోర్ కొడుతోందని బయటికి వచ్చినట్లు చెప్పాడు.

మరో వ్యక్తి తనకు కరోనా సోకిందని మందుల కోసం బయటికి వచ్చినట్లు చెప్పాడు. నిజంగా అతను మందుల కోసం వచ్చాడో లేదో అని అతడి వద్ద ఉన్న మందుల చీటీని పోలీసులు పరిశీలించారు. నాలుగు రోజుల క్రితమే పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు తేలిందని పోలీసులు వివరించారు. వెంటనే వీరిద్దరినీ ఆటోలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి

ABOUT THE AUTHOR

...view details