పర్యటకులతో కిటకిటలాడే కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం... లాక్డౌన్ కారణంగా బోసిపోయింది. తమ చేష్టలతో పర్యటకులను ఆహ్లాదపరిచే కోతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. డ్యాం దగ్గరికి ఎవ్వరూ వెళ్లకపోవటం వల్ల కోతులకు తిండి దొరక్క బక్కచిక్కి పోయాయి.
కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న వానరాలు - LOCK DOWN EFFECT
కరోనా ప్రభావం కోతుల మీద తీవ్రంగా పడింది. ఇప్పటికే తిండి, నీళ్లు దొరక్క ఊళ్ల మీద పడ్డ వానరాలు... లాక్డౌన్ కారణంగా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం వద్ద పర్యటకులు పెట్టిన ఆహారంతో జీవించే కోతుల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది.
కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న వానరాలు
పర్యటకుల కోసం బిక్క చూపులతో కోతులు ఎదురుచూస్తున్నాయి. ఆకలి వేసినా... తినడానికి ఏమీ దొరక్కపోవటం వల్ల మానేరు నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నాయి. వానరాలు ఎక్కువగా ఉండే కొండగట్టుకు మాత్రమే వెళ్లి పండ్లు అందిస్తున్నారు పలువురు జంతు ప్రేమికులు.