తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్తు బిల్లులు... వసూళ్లు సగమే..! - lock down effect on electricity bill payments

విద్యుత్తు బిల్లుల వసూళ్లకు లాక్‌డౌన్‌ రూపంలో కొత్త సమస్య ఎదురొచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం, ఇళ్ల వద్దకు వచ్చి మీటర్‌ రీడింగ్‌ను తీయకపోవడంలాంటి ఇక్కట్లతో బకాయిల బెంగ తప్పలేదు. ఇటు వినియోగదారుడితోపాటు అటు విద్యుత్తు సంస్థ కూడా బిల్లు విషయంలో సందిగ్ధతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇన్నాళ్లు నెలకొంది. ఫలితంగా గడిచిన రెండు నెలలుగా బకాయిల చెల్లింపు విషయంలో మందగమనమే కనిపించింది.

corona effect on electricity bill payments in karimnagar district
విద్యుత్తు బిల్లులు... వసూళ్లు సగమే..!

By

Published : May 24, 2020, 8:55 AM IST

స్పష్టత లేకపోవడంతో కొందరు.. వచ్చే నెలలో చెల్లిస్తామనేలా ఇంకొందరు విద్యుత్​ బిల్లులు చెల్లించకుండా దాటవేత ధోరణిని అవలంబించారు. మరోవైపు విద్యుత్తు శాఖ అధికారులు సిబ్బంది కూడా అందుబాటులో ఉన్న అంతర్జాలం వేదికగానే వసూళ్లపై దృష్టిపెట్టడంతో అనుకున్న లక్ష్యం విషయంలో సాధించలేకపోయారు. ఇక ఊహించని తరహాలో వ్యాపారాలు దెబ్బతినడం, ఉద్యోగ, ఉపాధి విషయంలో అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం వల్ల కూడా బిల్లు చెల్లింపులపై కనిపించని ప్రభావాన్నే చూపించింది.

గందరగోళంతో దూరం..:

బకాయిల విషయంలో ప్రతినెల అనుకున్న స్థాయిలో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా గృహసంబంధిత సర్వీసుల విషయంలో 90 శాతానికిపైగా వినియోగదారులు చెల్లింపుల దిశగా ఆసక్తిని చూపిస్తారు. కరోనా ప్రభావం మొదలైన మార్చి నెలకు సంబంధించిన బిల్లుల్ని ఏప్రిల్‌ నెలలో 88శాతం మంది చెల్లించారు. మిగతావి వ్యాపార సంబంధితమైనవి పెండిగ్‌ జాబితాలోకి చేరాయి.

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల సర్వీసులు కలిపి 4,99,310 ఉండగా ఇందులో ఇళ్లకు సంబంధించినవి 3,49,191 సర్వీసులున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెల విద్యుత్తు వాడకానికి సంబంధించి 2019 నెలకు సంబంధించిన మొత్తాన్నే చెల్లించాలని విద్యుత్తుశాఖ అధికారులు నిర్ణయించడంతో కొంతమంది వినియోగదారులపై అదనపు భారం పడింది. ముఖ్యంగా ఇళ్లు మారిన వాళ్లు పాత ఇంటి బకాయిని చెల్లించాల్సి రావడంతో ఒకింత గందరగోళానికి గురయ్యారు.

కొత్తగా నిర్మించిన ఇళ్లలోని వారు మార్చి నెలకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఇక మార్చి నెలలో అందుబాటులో ఉన్న అంతర్జాలం ద్వారా సుమారుగా 60వేల మంది విద్యుత్తు బిల్లుల్ని చెల్లించారు. ఏప్రిల్‌ నెలకు వచ్చే సరికి ఈ సంఖ్య తగ్గింది. మరోవైపు నెలనెలకు రీడింగ్‌ పెరుగుతుండటం, మీటర్‌ రీడింగ్‌ విషయంలో సందిగ్ధత ఉండటంతో వినియోగదారులు గందరగోళానికి గురవుతూ వస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్తు శాఖ అధికారులు కూడా వాడకపుదారుల సమస్యల్ని తీర్చేలా పలుమార్లు అవగాహన కార్యాక్రమాల్ని నిర్వహించారు. ఇక ప్రతి నెల రీడింగ్‌ తీసే సదుపాయం లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 72 మంది మీటర్‌ బిల్లింగ్‌ సిబ్బందికి ఉపాధి, వేతనం రూపంలో కష్టకాలమే ఎదురైంది.

ఇదీ చూడండి:సోమవారం రంజాన్​ వేడుకలు.. నెలవంక వల్లే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details