కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కరీంనగర్లో ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. దుకాణాదారులు, వ్యాపారులు, ప్రజలంతా స్వీయ బంద్ పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన చిన్నచిన్న దుకాణాలు, మందుల షాపులు, పెట్రోల్ బంకులు మినహా అందరూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు.
కరీంనగర్లో కరోనా అలర్ట్..స్వచ్ఛందంగా బంద్ - corona in karimnagar
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కరీంనగర్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రజలంతా స్వీయ రక్షణకై ఇళ్లలోనే ఉండటం వల్ల నగరమంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది.
కరీంనగర్లో కరోనా అలర్ట్..స్వచ్ఛందంగా బంద్
హోటళ్లు, షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల బస్టాండ్‌లో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితయ్యారు.
- ఇవీ చూడండి:'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'