కరీంనగర్లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. శనివారం ఒక్కరోజే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితుల సంఖ్య మొత్తంగా 258కి చేరింది. నగరంలోని అన్ని డివిజన్ల పరిధిలో వైరస్ ఉద్ధృతి పెరుగుతుండడం వల్ల ఆయా కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కరీంనగర్లో కరోనా విజృంభణ... ప్రజల్లో ఆందోళన - latest news of karimnagar
కరీంనగర్‌ను కరోనా కలవర పెడుతోంది. ఒక్కరోజే 24 కేసులు నమోదు కావడంతో జిల్లాలో ఆందోళన కనిపిస్తోంది.
కరీంనగర్లో విజృంభిస్తోన్న కరోనా.. స్థానికుల్లో ఆందోళన
నిత్యం వ్యాపారలావాదేవీలు జరిగే టవర్ సర్కిల్ ప్రాంతంలో కొవిడ్ బారినపడి ఒకరు మృతి చెందారు. ఫలితంగా మూడు రోజులపాటు వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. ఆ ప్రాంతంలో పాజిటివ్ కేసులు వచ్చిన సందర్భంగా నగర మేయర్ యాదగిరి రావు... దగ్గరుండి హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని మేయర్ సూచించారు.
ఇదీ చూడండి:కన్నా.. బెంగ వద్దురా అనడమే అసలైన మందు.!