కరోనా వైరస్ రాష్ట్రంలో విలయతాండవం సృష్టిస్తోంది.. పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల వరకు వ్యాపిస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇటీవలె హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుడికి పాజిటివ్ నిర్ధరణ అయినట్టు అధికారులు తెలిపారు. కాగా అతన్ని క్వారంటైన్లో ఉంచి బాధితుడి తల్లిదండ్రులను కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్న కరోనా.. భయాందోళనలో స్థానికులు - latest news of corona updates in karimnagar
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపురం మండలంలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. హైదరాబాద్ నగరం నుంచి పల్లెలకు వెళ్లిన వారిలో ఎక్కువగా వైరస్ లక్షణాలు కనిపించడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
![పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్న కరోనా.. భయాందోళనలో స్థానికులు corona cases in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7940267-45-7940267-1594196643403.jpg)
పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్న కరోనా.. భయాందోళనలో స్థానికులు
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న మరో వ్యక్తికి కరోనా నిర్ధరణ కాగా.. వైరస్‌తోనే బాధితుడు తన స్వగ్రామానికి వెళ్లాడు. సమాచారం అందుకున్న ఆరోగ్య సిబ్బంది అతన్ని అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు జరిపి హోమ్ క్వారంటైన్లో ఉంచారు.