తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో కరోనాకేసులు తగ్గుదల

ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనితో కొన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్​ నిబంధనలను సడలించారు. గత 21 రోజులుగా కొత్తకేసులు నమోద కాకపోగా ఉమ్మడి జిల్లాలో కేసుల సంఖ్య 3కు తగ్గిపోయాయి.

corona-cases-decreased-in-karimnagar-present-only-3-corona-cases-under-treatment
కరీంనగర్​లో కరోనాకేసులు తగ్గుదల

By

Published : May 11, 2020, 10:16 AM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య మూడుకు తగ్గిపోయాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గత 21రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడం వల్ల రెండు జిల్లాలను గ్రీన్​జోన్​లోకి మార్చాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మరో వైపు పెద్దపల్లి జిల్లా గ్రీన్​జోన్​గా కొనసాగుతోంది.

ప్రస్తుతం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జగిత్యాలలో ఒక్కొక్కటి చొప్పున కరోనా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిని కంటెన్మెంట్ ప్రాంతంగా ప్రకటించడమే కాకుండా ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మానాల, లంబాడిపల్లి గ్రామాల్లో వైద్యబృందాలు ఇంటింటా తిరుగుతూ వైద్య పరీక్షలు చేపడుతున్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఎవరైతే స్వస్థలాలకు వెళ్లాలనుకునుకుంటున్నారో వారి నుంచి పోలీసులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూని కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నారు. లాక్​డౌన్ నిబంధనలు సడలించినా ప్రజలు మాత్రం మధ్యాహ్నం తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. ఎవరైనా ప్రజలు ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా రోడ్లపై తిరుగూతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ABOUT THE AUTHOR

...view details