ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. కొవిడ్-19 ఉద్ధృతి క్రమంగా తగ్గుతుండటం వల్ల నిబంధనలను కొంత మేరకు సడలిస్తున్నారు. ఉదయం వేళల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి అనుమతిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 19 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 18 మంది కోలుకుని ఇళ్లకెళ్లారు. ఒకరు చికిత్స పొందుతున్నారు. ఫలితంగా సాహిత్నగర్, శర్మనగర్లలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిబంధనలను సడలించారు.