తాగిన మైకంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు ఓ వినియోగదారుడు. కరీంనగర్‌లోని బ్యాంక్ కాలనీకి చెందిన రంగారావు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేశాడు. పార్శిల్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ రంగారావుకు ఇచ్చేందుకు అపార్ట్మెంట్లోకి వెళ్లాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న రంగారావు ఎందుకు వచ్చావంటూ... దుర్బాషలాడుతూనే పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. భయాందోళనకు గురైన డెలివరీ బాయ్ తప్పించుకుని... మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తోటి ఉద్యోగిపై దాడి చేసిన విషయం తెలిసి స్విగ్గీ డెలివరీ బాయ్‌లందరూ ఆదిత్య అపార్ట్‌మెంట్‌కు చేరుకుని ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వినియోగదారుని దాడి - Consumer Attack on Swiggy Delivery Boy
బిర్యానీ ఆర్డరిచ్చాడు. వచ్చేలోపు రెండు పెగ్గులేశాడు. మత్తు ఎక్కేసరికి... బిర్యానీ ఆర్డరిచ్చిన విషయం మర్చిపోయి... డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన యువకునిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు.

Consumer Attack on Swiggy Delivery Boy