కరీంనగర్ జిల్లా దుర్శేడులో నిర్మించిన రైతు వేదిక చూడటానికి అందంగా తీర్చిదిద్దినా పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 24 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనానికి నాసిరకం సామగ్రి వినియోగించారని రైతులు వాపోతున్నారు. మూణ్నెళ్ల క్రితమే రైతు వేదిక నిర్మాణం పూర్తి చేయగా తలుపులు ఊడిపోవడం, సిమెంట్ పెచ్చులు రాలడం, టైల్స్‌కు పగుళ్లు ఏర్పడటంపై స్థానికులు మండిపడుతున్నారు. అన్నదాతల సౌకర్యార్ధం రైతు వేదిక నిర్మించారా లేక గుత్తేదారుల కోసమే నిధులు ఖర్చు చేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు కొందరు!
గుత్తేదారులు మాత్రం నాణ్యతలో రాజీలేకుండా... పనిచేసినట్లు చెప్పుకొస్తున్నారు. అధికారుల సూచించిన సామగ్రినే ఉపయోగించామని స్పష్టం చేస్తున్నారు. స్థానికులు కొందరు వేదిక పనులకు నష్టం చేకూర్చినట్లు చెబుతున్నారు.