TTD construct Venkateswara Swamy Temple in Karimnagar : ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశానుసారం కరీంనగర్ లో రూ.20కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు టీటీడీ ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్లో 10ఎకరాల స్థలాన్ని తితిదేకు కేటాయించిందని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్ కృషితో కరీంనగర్ ప్రజలకు వెంకటేశ్వరుని దర్శన కల సాకారం కానుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో టీటీడీ ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వజరీ కమిటీ చైర్మన్ భాస్కర్రావులకు అందజేసారు.
ముహుర్తం ఖరారు..:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈనెల 31వ తేదీన ఉదయం 7గం. 26 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుంచి కరీంనగర్ ప్రజలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించే విదంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు.
ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం..: త్వరలోనే వినోద్ కుమార్, భాస్కర్‌రావులతో కలిసి తిరుమలకు వెళ్లి.. ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్‌లోని పద్మనగర్‌లో నిర్మించే శ్రీవెంకటేశ్వర ఆలయం యెక్క అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు.. మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అంశాలను పరిశీలిస్తామన్నారు. అత్యంత త్వరలోనే శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి కరీంనగర్‌తో పాటు తెలంగాణ ప్రజలకు ఆ దేవదేవుని ఆశీస్సులు అందిస్తామన్నారు.
"తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాము. శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈనెల 31వ తేదీన ఉదయం 7గం. 26 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తాము. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుంచి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తాము".-వై.వి.సుబ్బారెడ్డి, టీటీడీ ఛైర్మన్
కరీంనగర్లో వెంకన్న ఆలయనిర్మాణం.. తితిదే ఉత్తర్వులు విడుదల ఇవీ చదవండి: