తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్​ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది' - latest news on mla sridhar

కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే దుద్దుళ్ల శ్రీధర్​బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Congress wins most seats
'కాంగ్రెస్​ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది'

By

Published : Jan 4, 2020, 10:45 AM IST

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోబోతున్నట్లు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెరాసకు ఓటేస్తే.. భాజపాకు వేసినట్లేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధాన పరమైన నిర్ణయం తీసుకున్నా.. తెరాస దానికి ముందుండి వత్తాసు పలుకుతుందని అన్నారు. రెండోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అనేక పథకాలను ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు.

'కాంగ్రెస్​ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది'

ఇవీ చూడండి: పంచాయతీ కార్మికులకు తీపి కబురు

ABOUT THE AUTHOR

...view details