తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో సీఎం పర్యటన.. కాంగ్రెస్​ శ్రేణులు అరెస్ట్​ - CM KCR visits Karimnagar

CM KCR Karimnagar Tour : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కరీంనగర్​లో పర్యటించనున్నారు. నగర మాజీ మేయర్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. అనంతరం మంత్రి గంగుల ఇంటికి వెళ్లనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నగర కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.

karimnagar
కరీంనగర్​

By

Published : Dec 8, 2022, 12:25 PM IST

Updated : Dec 8, 2022, 1:30 PM IST

CM KCR Karimnagar Tour : ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు కరీంనగర్​ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల ముందు సీఎం కేసీఆర్​ కరీంనగర్​కు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఆ హామీలు నెరవేర్చిన తర్వాతనే కరీంనగర్​ గడ్డపై అడుగుపెట్టాలని కాంగ్రెస్​ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్​ రెడ్డి అన్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్​ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో హస్తం నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.

సీఎం కేసీఆర్ కరీంనగర్ మాజీ మేయర్​ రవీందర్ ​సింగ్​ కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్​ ఇంటికి వెళ్లనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా గంగుల ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.

కేసీఆర్ కరీంనగర్​ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ నేతలు అన్నారు. సీఎం పర్యటనను అడ్డుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నగర కాంగ్రెస్​ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యాలయంలో ఉన్న కాంగ్రెస్​ నాయకులను బయటకు రానీకుండా కట్టడి చేస్తున్నారు.

టీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్భంధించి, అరెస్టులు​ చేసినంత మాత్రాన తమ ఆందోళనలను ఆపమని కాంగ్రెస్​ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్​రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్​ నియంతలా తన పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అరెస్ట్​లు కొత్తేమీ కాదని.. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన సోనియా గాంధీని ఆదర్శంగా తీసుకుంటూ శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

జగిత్యాల జిల్లా అల్లీపూర్‌ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండు చేస్తూ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్‌ జగిత్యాలకు వచ్చి బండ లింగాపూర్‌ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటంతో అల్లీపూర్‌ గ్రామస్తులు సైతం ఆందోళనకు దిగారు. అయితే గతం నుంచి అల్లీపూర్‌ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండు ఉన్నా పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటావార్పు చేసేందుకు యత్నించగా పోలీసులు నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 8, 2022, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details