తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్​ ఆందోళన - రామడుగు వార్తలు

ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్​లో టీపీసీసీ అధికార ప్రతినిధి మెడిపెల్లి సత్యం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మార్కెట్ సిబ్బంది ఎవరూ లేకపోవటంతో కార్యాలయ కుర్చీలు ధ్వంసం చేశారు.

congress protest for grain purchase in karimnagar district
ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్​ ధర్నా

By

Published : Nov 17, 2020, 4:35 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి మెడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మార్కెట్ సిబ్బంది ఎవరూ లేకపోవటంతో కార్యాలయ కుర్చీలు ధ్వంసం చేశారు.

నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ధాన్యం కొనుగోలు చేయటం లేదని రైతులు వాపోయారు. సత్వరం ధాన్యం కొనుగోలు చేపట్టని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని మెడిపల్లి సత్యం చెప్పారు. అన్నదాతలు పండించిన పంట అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారని అన్నారు.

ఇదీ చదవండి:మెుక్కజొన్న కొనుగోలు చేయడం లేదని రోడ్డెక్కిన రైతన్న

ABOUT THE AUTHOR

...view details