కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఎస్సారెస్పీ వరదకాలువపై నిర్మించే మోతె కాలువల పేరిట తెరాస నాయకులు కాలాయాపన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. రెండేళ్ల క్రితం నాయకులు ఎన్నికల అంశంగా తెరాస నాయకులు ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. ఏడాది క్రితం శానగర్ గ్రామంలో రాష్ట్ర మంత్రి ఈటల శంకుస్థాపన చేశారని వివరించారు.
'మోతె కాలువల పేరిట తెరాస నాయకులు కాలాయపన చేస్తున్నారు'
మోతె కాలువల పేరిట తెరాస నాయకులు కాలాయాపన చేస్తున్నారని కరీంనగర్లో కాంగ్రెస్ ప్రతినిధులు ఆరోపించారు. మోతె కాలువలతో పాటు నారాయణపూర్ రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తి చేయని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
congress press meet in karimnagar district
తాజాగా పరిపాలన అనుమతి పొందినట్టు ప్రకటించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కేవలం కమిషన్ల కోసం రైతులకు సాగునీరు అందకుండా అడ్డుకోవటం శోచనీయమన్నారు. రానున్న యాసంగి పంట కాలం వరకు.. మోతె కాలువలతో పాటు నారాయణపూర్ రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తి చేయని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?