మద్దతు ధర కోల్పోతున్న అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మానకొండూరులో ఆందోళన చేపట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లు, సహకార సంఘాల ద్వారా మద్దతు ధర కల్పించి కొనుగొలు చేయాలని కోరారు.
రైతులకు న్యాయం చేయాలని డిమాండ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటితమై రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాల బిల్లును వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, మానకొండూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నుమాయిష్ వాయిదా... కొవిడ్ నిబంధనలే కారణం