హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థి(huzurabad congress candidate)ని ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకటనర్సింగ్ రావును హుజూరాబాద్ అభ్యర్థి(huzurabad congress candidate)గా అధిష్ఠానం ప్రకటించింది.
Huzurabad Bypoll:హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. ఎవరంటే..? - huzurabad by election 2021
18:49 October 02
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తిప్పరపు సంపత్, కిసాన్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్.. పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలించింది. చివరగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బల్మూరి వెంకటనర్సింగ్ రావును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. తెరాస తరఫున బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస యాదవ్.. ఇవాళ తన నామినేషన్ వేశారు. భాజపా తరఫున ఈటల అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అధికార తెరాస, భాజపాలు హుజూబాద్ ఉప ఎన్నికలో దూసుకుపోతుండగా.. హస్తం పార్టీ మాత్రం అభ్యర్థిని ఎట్టకేలకు నేడు ప్రకటించింది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదీ చూడండి: