తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad By Election: హుజూరాబాద్‌ కార్యాచరణపై కాంగ్రెస్‌ కసరత్తు - హుజూరాబాద్ ఎన్నికలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad By Election) కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి దక్కించుకోడానికి అధికార తెరాస వ్యూహరచన చేయడంతోపాటు అభ్యర్థిని కూడా ప్రకటించింది. తెరాసను వీడి భాజపా అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఈటల రాజేందర్‌ ఇప్పటికే నియోజక వర్గం అంతా చుట్టేశారు. ఈ క్రమంలో తమ సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ కార్యచరణను సిద్ధం చేస్తోంది.

Huzurabad By Election
Huzurabad By Election

By

Published : Oct 4, 2021, 7:55 AM IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక (Huzurabad By Election)లో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన పార్టీ ఈసారైనా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. 2018 ఎన్నిక (Huzurabad By Election)ల్లో హుజూరాబాద్‌లో 61 వేల ఓట్లకు పైగా సాధించి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు తాజా ఎన్నిక ప్రధాన సవాల్‌గా మారింది. 2004 నుంచి వరుసగా ఓడుతున్నా.. ద్వితీయ స్థానంలో ఉంటూ వస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరడంతో పాటు నియోజకవర్గంలోని మండలస్థాయి ముఖ్యనేతల్లో పలువురు తెరాస, భాజపాల్లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ స్థానికంగా నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది.

అభ్యర్థి (Huzurabad By Election)ని ఖరారు చేయడంలోనే కాంగ్రెస్‌ తీవ్ర జాప్యం చేసింది. స్థానిక నేతలను బరిలో దింపాలా? బయటి వారిని పోటీ చేయించాలా? అనే సందిగ్ధత కొన్నాళ్లు కొనసాగింది. చివరకు ఎన్‌.ఎస్‌.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరి (Huzurabad By Election)లో దింపింది. ఎలాంటి సామాజిక సమీకరణలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముఖ్యనేతలైన మాజీమంత్రి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, సీనియర్‌ నేత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కూడా బల్మూరి వెంకట్‌ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపడంతో పీసీసీ ఆమోద ముద్ర వేసింది. ఆయన నామినేషన్‌ దాఖలు అనంతరం కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి ముఖ్యనేతలతో పాటు జిల్లా నేతలు ప్రచారం (Huzurabad By Election)లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కాగా నాగార్జునసాగర్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓట్లను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై అంతర్గత సమీక్ష ముగిసిందని, ఇక గ్రామ స్థాయి నుంచి నాయకత్వంపై దృష్టి సారిస్తామని పార్టీ నేతలు తెలిపారు.

ఇదీ చూడండి:Revanth Reddy Republic Movie: రిపబ్లిక్ చిత్రాన్ని వీక్షించిన రేవంత్​రెడ్డి, సీతక్క

Huzurabad By Election Campaign: పదునెక్కిన ప్రచారం... నువ్వానేనా అంటోన్న తెరాస, భాజపా

Huzurabad by-election: 'హుజురాబాద్​లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి'

ABOUT THE AUTHOR

...view details