తెలంగాణ

telangana

ETV Bharat / state

'తేమ పేరుతో మంచి పత్తిని కొనుగోలు చేయడం లేదు'

తేమ పేరుతో.. మంచి పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రావు ఆరోపించారు. వెంటనే మార్కెట్ పాలకవర్గం స్పందించి... సీసీఐతో పత్తిని కోనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.

By

Published : Nov 4, 2020, 12:44 PM IST

congress leaders serious on cci in Karimnagar
'తేమ పేరుతో మంచి పత్తిని కొనుగోలు చేయడం లేదు'

డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణరావు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లు తీరును ఆయన పరిశీలించారు. పత్తి నిల్వలు చూసి.. రైతులతో మాట్లాడారు.

నాణ్యమైన పత్తిని ఎందుకు కొనుగోలు చేయటం లేదంటూ సీసీఐ అధికారి మరాండీని ప్రశ్నించారు. సీసీఐ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మంచి పత్తిని తేమ పేరుతో... కొనుగోలు చేయటం లేదన్నారు. ప్రైవేటు వ్యాపారులు ఇష్టారీతిన ధరలను నిర్ణయిస్తూ... రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే మార్కెట్‌ పాలకవర్గం స్పందించి... సీసీఐతో పత్తిని కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు... అన్నదాతల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details