కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ సబ్‌స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వచ్చిన అధిక బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ బిల్లుల రద్దుకు డిమాండ్.. కాంగ్రెస్ ధర్నా - latest news of karimnagar
లాక్‌డౌన్ నేపథ్యంలో వచ్చిన విద్యుత్ బిల్లులను రద్దు చేయాలంటూ కరీంనగర్ జిల్లా తాడికల్ సబ్‌స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేతల ధర్నా
మహమ్మారి ప్రభావం వల్ల నిరుపేదలకు పూట గడువక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఈ రకంగా వారిపై అధిక బిల్లులను మోపడం సరికాదన్నారు. బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించి పేదలను ఆదుకోవాలని వారు కోరారు. అనంతరం విద్యుత్ అధికారికి వినతిపత్రాన్ని అందించారు.
ఇదీ చూడండి:-నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు