కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ క్యాంపు కార్యాలయం ముందు టీపీసీసీ అధికార ప్రతినిధి మెడిపెల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆయన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ధాన్యం కొనుగోలుకు స్వస్తి పలికే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా - కరీంనగర్ అప్డేట్స్
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలుకు స్వస్తి పలికే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
గేటు లోపలికి దూసుకెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి:'డ్రైవర్‌కు గుండెపోటు వస్తే పరిహారం ఇవ్వాల్సిందే'