కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తోన్న సమయంలో మంత్రి కాన్వాయ్ అక్కడికి చేరుకుంది.
మంత్రి కొప్పుల కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు - Minister Koppula Eshwar latest news
చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ అడ్డుకుంది. కాన్వాయ్ వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ శ్రేణుల నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టడంతో మంత్రి వెళ్లిపోయారు.
మంత్రి కొప్పుల కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
సన్నరకం వరి ధాన్యానికి రూ.2,500 రూపాయలు చెల్లించాలని కోరుతూ.. కాంగ్రెస్ నాయకులు కాన్వాయ్‌కు అడ్డంగా రోడ్డుపై కూర్చుకున్నారు. పోలీసులు సర్ది చెప్పినప్పటికీ నినాదాలు చేశారు. దీనితో పోలీసులు బలవంతంగా కార్యకర్తలను రోడ్డు పక్కకు లాక్కెళ్లారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ వెళ్లిపోయారు.
- ఇదీ చూడండి :కదలని బస్సులు.. తెరుచుకోని దుకాణాలు...
Last Updated : Dec 8, 2020, 1:15 PM IST