తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కరీంనగర్లో హెచ్చరించారు. తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్ స్థానికేతరుడని... ఆయనకు జిల్లా సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'తెరాస అభ్యర్థికి జిల్లాపై కనీస అవగాహన లేదు' - కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి
కరీంనగర్ ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యాలని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మంత్రి పదవి ఇస్తానన్న కేటీఆర్ ఏ పార్టీ తరఫున ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
పొన్నం ప్రభాకర్