తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆయన కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు' - karimnagar latest news

తెరాస నుంచి తనకు ఆహ్వానం వచ్చిందనడంలో వాస్తవం లేదని... హుజూరాబాద్​ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి అన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్​ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో​ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Congress leader Kaushik Reddy news
ఈటల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్​ నేత కౌశిక్​ రెడ్డి

By

Published : Jun 12, 2021, 10:27 PM IST

రెండేళ్లుగా నోరు మెదపని ఈటల రాజేందర్​ ప్రతిపక్ష నాయకులపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని... కాంగ్రెస్​ నేత కౌశిక్​ రెడ్డి విమర్శించారు. ఆయనపై వచ్చిన కబ్జా ఆరోపణలను కప్పి పుచ్చుకోవడానికే తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ నుంచి డబ్బులు తీసుకున్నానడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.

కేటీఆర్​ని కలిసినంత మాత్రాన తెరాసలోకి వెళ్తున్నాననే అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తనకే... ఈ ఉపఎన్నికలోనూ టికెట్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 12 ఏళ్లుగా నియోజకవర్గంలో ఈటల రాజేందర్​ను ప్రశ్నిస్తూనే ఉన్నానన్నారు.

ఆయన రాజీనామా సందర్భంగా అమరవీరుల స్థూపానికి మొక్కిన ఈటల... గడిచిన ఏడేళ్లలో ఒక్క అమరవీరుని గురించి అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు. దీనిపై వారి కుటుంబాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డనని చెప్పుకునే ఈటలకు మంత్రిగా ఉన్నప్పుడు బీసీలు ఎందుకు గుర్తురాలేదన్నారు.

ఇదీ చదవండి:చీఫ్​ జస్టిస్​ను కలిసిన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details