కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad ByElection)అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నలుగురి పేర్లతో కూడిన జాబితా పీసీసీ.. పార్టీ హైకమాండ్‌కు పంపింది. అందులో మాజీమంత్రి కొండా సురేఖతోపాటు మరో ముగ్గురి పేర్లు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం సీఎల్పీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు సమావేశమై హూజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. పీసీసీ సూచన మేరకే ఏఐసీసీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండడంతో ఇవాళ సమావేశమైన ముఖ్యనేతలు అధిష్ఠానానికి పంపిన జాబితాపై మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.
గురువారం ప్రకటన..?
ఇప్పటికే అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతోందన్న వాదన పార్టీలో ఉందని.. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటన వచ్చేట్లు ఏఐసీసీపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్, సీఎల్పీనేత, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్.. ఒక అభిప్రాయానికి వచ్చి.. అదే విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి పేరు గురువారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.
అక్టోబర్ 30న పోలింగ్..