తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయాలంటూ ధర్నా - ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయాలంటూకరీంనగర్​లో కాంగ్రెస్ ధర్నా

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకి దిగారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను సజావుగా చేయాలంటూ నినాదాలు చేశారు.

CONGRESS
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయాలంటూ ధర్నా

By

Published : Dec 10, 2019, 1:51 PM IST

ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయాలంటూ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో కిసాన్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రదాన రహదారిపై బైఠాయించి ధర్నాకి దిగారు. మంత్రి గంగుల కమలాకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ధాన్యం కొనుగోళ్లను సజావుగా చేయాలంటూ నినాదాలు చేశారు. కోతల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్‌ చిత్రపటాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. చిత్రపటాన్ని లాక్కున్నారు.

ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయాలంటూ ధర్నా

ఇవీ చూడండి: రేపు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు- ఆమోదంపై భాజపా ధీమా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details