భారత్ బంద్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.
హుజూరాబాద్‌లో కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఆందోళన - హుజూరాబాద్ వార్తలు
కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బంద్ నిర్వహిస్తున్నారు. స్థానిక బస్ డిపో ముందు కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఆందోళన
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిపో ఎదుట నాయకులు ధర్నాకు దిగటంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు డిపో వద్దకు చేరుకొని బందోబస్తును నిర్వహించారు.
ఇదీ చదవండి:రైతు భవిత పరాధీనం- అందుకే అన్నదాత ఆగ్రహం!