వీణవంకలో తెరాస, ఈటల వర్గాల మధ్య ఘర్షణ - etela followers arrest news

16:09 May 16
ఈటల వర్గీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కరీంనగర్ జిల్లా వీణవంకలో తెరాస, ఈటల వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మండల కేంద్రంలో జమ్మికుంట వ్యవసాయ కమిటీ ఛైర్మన్ బాలకిషన్‌రావు తన అనుచరులతో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ క్రమంలో ఈటల వర్గీయులైన తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు మోటం వెంకటేష్, ఇల్లందకుంట దేవస్థానం కమిటీ సభ్యుడు దాసారపు రాజుతో పాటు రాయిశెట్టి కుమార్‌లు అక్కడికి చేరుకొని.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ... మధ్యాహ్నం సమయంలో ప్రెస్‌మీట్ పెట్టడమేంటని ప్రశ్నించారు.
సమాచారం అందుకున్న పోలీసులు... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగగా... ఈటల వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.