కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజపల్లి గ్రామంలో రైల్వే భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైల్వే సోషియో ఎకనామిక్ సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారుల ముందు బైఠాయించారు.
పరిహారం చెల్లించాలని రైల్వే భూనిర్వాసితుల ఆందోళన - Concern of railway land occupants
రైల్వే లైను కోసం చేపట్టిన భూ సర్వేలో భూములు కోల్పోయినవారికి ఇప్పుటి వరకు పరిహారం లభించలేదని కరీంనగర్ జిల్లా దేశరాజపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ... రైల్వే సోషియో ఎకనామిక్ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారుల ముందు బైఠాయించారు.
పరిహారం చెల్లించాలని రైల్వే భూ నిర్వాసితుల ఆందోళన
పదిహేనేళ్ల క్రితం కరీంనగర్ -నిజామాబాద్ రైల్వే లైను కోసం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:చనిపోయిన పావురం తీయడానికెళ్లి లైన్‌మన్ మృతి