తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​పై ఆ వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు - ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

Complaint on MLC Kaushik Reddy in HRC: ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బీసీ రాజకీయ ఐకాస ఎస్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసింది. గవర్నర్ తమిళిసై పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కౌశిక్​రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ ఐకాస ఛైర్మన్ డిమాండ్ చేశారు. వెంటనే ఎమ్మెల్సీపై కేసు నమోదుకు డీజీపీకి ఆదేశివ్వాలని కోరారు.

governor
governor

By

Published : Jan 28, 2023, 7:55 PM IST

Complaint on MLC Kaushik Reddy in HRC: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో బీసీ రాజకీయ ఐకాస ఫిర్యాదు చేసింది. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకై డీజీపీకి ఆదేశాలివ్వాలని... ఐకాస ఛైర్మన్ రాచాల యుగేందర్​గౌడ్ ఎస్‌హెచ్‌ఆర్సీని కోరారు.

ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: అలాగే గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్​ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కౌశిక్​రెడ్డిని బర్తరఫ్ చేయాలని రాచాల యుగేందర్​గౌడ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్​ను మహిళా అని కూడా చూడకుండా కౌశిక్​రెడ్డి అగౌరవ పరిచారని ధ్వజమెత్తారు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరల రిపీట్ కాకుండా ఉండాలంటే ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్​ని ఐకాస ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.

గవర్నర్​పై వివాదాస్పద వ్యాఖ్యలు : పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ నెల 25న జమ్మికుంటలో నిర్వహించిన ఓ సమావేశంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఇప్పటిదాకా తన సీటు కింద పెట్టుకొని కూర్చుంటారా అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. ఇలా ఓ మహిళా గవర్నర్​ అని చూడకుండా మాట్లాడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details