కరీంనగర్ నగర వ్యాప్తంగా ధరణి పోర్టల్ సర్వే 84.83% శాతం పూర్తైందని కమిషనర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్ సర్వేలో భాగంగా కరీంనగర్‌లోని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన ఆస్తుల వివరాలను నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరు క్రాంతి, సర్వే సిబ్బందికి అందించారు. మంత్రి ఆస్తులు, కుటుంబ సబ్యుల వివరాలను సేకరించి ధరణి పోర్టల్ యాప్‌లో నమోదు చేశారు.
ధరణిలో మంత్రి గంగుల ఆస్తులను నమోదు చేసిన కమిషనర్ - ధరణీ పోర్టల్లో నమోదు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్ సర్వేలో భాగంగా కరీంనగర్‌లోని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆస్తుల వివరాలను నమోదు చేయించుకున్నారు. తన నివాసానికి వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరు క్రాంతి, సిబ్బందికి వివరాలు సమర్పించారు.

ధరణిలో మంత్రి గంగుల ఆస్తులను నమోదు చేసిన కమిషనర్
నగర వ్యాప్తంగా దరణి సర్వే ప్రశాంతంగా కొనసాగుతుందని కమిషనర్ అన్నారు. ఇప్పటి వరకు డివిజన్ల వారిగా మొత్తం 60,129 అసెస్మెంట్లను ధరణి పోర్టల్లో నమోదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా మిగిలిన అసెస్మెంట్లను సర్వే చేసి సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :నెలరోజుల్లో ఎల్లూరు పంప్‌హౌజ్ పునఃప్రారంభం!