కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ తండా, నల్లని తండాల్లో నర్సరీలు, వైకుంఠధామం, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ శశాంక సందర్శించారు. రాయికల్ తండాలో ఉన్న నర్సరీని పరిశీలించి మొక్కలకు రోజూ నీరు పోయాలని ఆదేశించారు. నల్లని తండాలో నిర్మిస్తున్న వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, నిర్మాణం పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ఎంతమంది పిల్లలు వస్తున్నారని వారికి సరైన పోషకాహారం అందిస్తున్నరా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో 40 మంది పిల్లలకు ఎక్కువగా ఉంటే అదనంగా గదులు కేటాయించనున్నట్లు వివరించారు. అనంతరం తండావాసులు చేసిన జొన్న రొట్టెలను గ్రామస్థులతో కలిసి కలెక్టర్ తిన్నారు.