తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చెయ్యండి' - కరీంనగర్​లోని రైతువేదిక నిర్మాణ పనులను కలెక్టర్​ పరిశీలన

రైతు ఐక్యవేదిక భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక తెలిపారు. హుజూరాబాద్​ మండలం సింగాపూర్​లో పర్యటించిన ఆయన అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు.

collector shashanka visit singaapur village in karimnagar
'రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చెయ్యండి'

By

Published : Oct 6, 2020, 7:51 PM IST

రైతు ఐక్యవేదిక భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో నిర్మిస్తున్న రైతు ఐక్యవేదిక భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పంచాయతీ రాజ్​శాఖ ఎస్‌ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఈ ప్రశాంత్‌రావులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ నెల 20వ తేదీలోపు నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పనులకు కావల్సిన మౌలిక సదుపాయాలను ప్రజాప్రతినిధులు కల్పిస్తారన్నారు. నాణ్యత ప్రమాణాలను తప్పక పాటించాలన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నిర్మాణ పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచి మంద మంజుల, తహసీల్దార్‌ బావుసింగ్‌, ఏడీఏ ఆదిరెడ్డి, ఎంపీడీవో క్రిష్ణ ప్రసాద్‌, ఎంపీవో ప్రభాకర్‌, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details