కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర, దేశరాజుపల్లి గ్రామాల్లోని రైతు వేదిక నిర్మాణాలను జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. నిర్మాణ పనులను వేగిరం చేయాలని అధికారులు, గుత్తేదారులకు సూచించారు. ఈనెల 17లోగా రైతు వేదికలు నిర్మించాలన్నారు. దేశరాజుపల్లిలో వ్యవసాయేతర దరఖాస్తుల నమోదును తనిఖీ చేశారు.
'ఈనెల 17లోగా రైతు వేదికలను పూర్తి చేయ్యాలి' - latest news of karimnagar district
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రాామాల్లో చేపడుతున్న రైతు వేదిక నిర్మాణాలను, వ్యవసాయేత ఆస్తుల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఈ నెల 17లోగా వేదికలను పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులకు సూచించారు.

'ఈనెల 17లోగా రైతు వేదికలను పూర్తి చేయ్యాలి'
ప్రభుత్వ భూముల నమోదులో జాగ్రత్త వహించాలన్నారు. మొబైల్ అప్లికేషన్ నమోదు చేసే సమయంలో ఆస్తుల సమాచారాన్ని సరిచూసుకుని నిర్ధారణకు వచ్చాక అప్లోడ్ చేయాలని సూచించారు. ఒకసారి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచిన అనంతరం మార్పులు చేసే అవకాశం లేనందున ఖచ్చితత్వాన్ని పాటించాలన్నారు. మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నందున సిబ్బంది సమాచార సేకరణలో జాప్యాన్ని నివారించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకలు.. ప్రాచుర్యం కోల్పోయిన నిలువురాళ్లు