తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన శశాంక - collector shashanka took charge

కరీంనగర్​ జిల్లా నూతన కలెక్టర్​గా శశాంక బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

collector shashanka took charge as karimnagar collector
నూతన కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన శశాంక

By

Published : Dec 18, 2019, 5:32 PM IST

కరీంనగర్​ జిల్లా నూతన కలెక్టర్​గా శశాంక బాధ్యతలు చేపట్టారు. జిల్లా డీఆర్వో ప్రావీణ్య, కలెక్టరేట్​ సిబ్బంది మేళతాళాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. మొదటగా కలెక్టర్​ ఛాంబర్​లో వినాయకునికి పూజలు నిర్వహించారు.

అనంతరం కుర్చీలో కూర్చుని కలెక్టర్​ శశాంక సంతకాలు చేశారు. జిల్లా అధికారులు శశాంకకు పూల కుండీలను అందించి పరిచయం చేసుకున్నారు. కరీంనగర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని శశాంక తెలిపారు.

నూతన కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన శశాంక

ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details