కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న పోలీసు క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు. సీపీ కమలాసన్ రెడ్డితో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతిని వెలిగించారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి: కలెక్టర్ శశాంక - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని... కరీంనగర్ కలెక్టర్ శశాంక అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న పోలీసు క్రీడా పోటీలను సీపీ కమలాసన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి: కలెక్టర్ శశాంక
4 సంవత్సరాల తరువాత నిర్వహించే ఈ పోటీలకు పోలీసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అథ్లెటిక్స్ పోటీలతో పాటు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, కో కో వంటి క్రీడలను నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషం : ఇంద్రకరణ్ రెడ్డి