తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్​ - కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక

కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా పాలనాధికారి శశాంక తనిఖీ చేశారు. కరోనా రెండో విడత వ్యాక్సినేషన్​​ కార్యక్రమం ఏర్పాట్లను ఈ సందర్భంగా పరిశీలించారు.

karimnagar Collector Shashanka
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్​

By

Published : May 26, 2021, 4:36 PM IST

కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, గుండి గోపాలరావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. కొవిడ్ రెండోదశ టీకా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.

కరోనా నిర్ధరణ పరీక్షలు, టీకా వేసేందుకు వేర్వేరు స్థలాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ టీకాలు అందరికీ వేసేలా కొన్ని నెలల పాటు చేపట్టే అవకాశం ఉందన్నారు.

అందుకోసం భౌతిక దూరం పాటించేలా పీహెచ్​సీల ఆవరణలో టెంట్లు, చలువ పందిరి ఏర్పాటు చేయాలని పాలనాధికారి సూచించారు. గంగాధరలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఇదీ చూడండి:వైద్య సిబ్బంది డిమాండ్లను నెరవేర్చాలి: ఈటల

ABOUT THE AUTHOR

...view details