తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన హరిత హారం, రైతువేదికలు, పల్లె ప్రగతి వనాలు, రైతు కల్లాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, జిల్లా వ్యవసాయాధికారి, ఈఈపీఆర్, తహసీల్దార్లు, ఆర్డీవో, మండల, డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ - కరీంనగర్ జిల్లా వార్తలు
రైతు వేదికలు, హరిత హారం, పల్లె ప్రకృతి వనాలు, డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, జిల్లా వ్యవసాయాధికారి, ఈఈపీఆర్, తహసీల్దార్లు, ఆర్డీవో, మండల, డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్
ప్రగతిలో ప్రధాన అంశాలైన స్మశాన వాటికల నిర్మాణాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం, ఇంకుడుగుంతల నిర్మాణంలో ఎంపీడీవోలు నిర్లక్ష్యం వహించకుండా పనులపై దృష్టి సారించాలన్నారు. అన్ని మండలాల్లో, గ్రామాల్లో మంకీ ఫుడ్ కోర్టు, మియావాకి వనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఇదీ చూడండి:బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా