తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే.. ఉపేక్షించేది లేదు: కలెక్టర్​ శశాంక - కరీంనగర్‌ జిల్లాలో కలెక్టర్ కె.శశాంక సమీక్ష సమావేశం

కరీంనగర్‌ జిల్లాలో కలెక్టర్ కె.శశాంక సమీక్ష సమావేశం నిర్వహించారు. భూఅక్రమాలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Collector Shashanka held a review meeting in Karimnagar district.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే.. ఉపేక్షించేది లేదు: కలెక్టర్​ శశాంక

By

Published : Aug 8, 2020, 9:52 PM IST

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీపీ కమలాసన్ రెడ్డి... సర్వే ఆఫీసర్లు, మెజిస్ట్రేట్ ఆఫీసర్లు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కార్పొరేషన్ పక్కనే భూఅక్రమాలు జరుగుతున్నాయని, అలాగే తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ సూచించారు. ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆర్డీవోస్థాయిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

బొమ్మకల్‌ లో 2018 సంవత్సరం నుంచి జరిగిన భూకబ్జాల విషయంలో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాట్ఓనర్​ను బెదిరించి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. బొమ్మకల్, సీతారాంపూర్, వివిధ గ్రామాలలో భూముల కబ్జాలు కొనసాగుతున్నాయని అన్నారు. భూఅక్రమాలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశం మేరకు ఏర్పాటు చేసిన కమిటీ 652, 695, 108, 99, 105, 228, 96, మొత్తం 87 ఎకరాల 25 గుంటల స్థలాన్ని డిప్యూటి ఇన్స్​పెక్టర్ సేవ్యా నాయక్ నాయకత్వంలో సర్వే చేసి అక్రమాలు గుర్తించినట్లు కలెక్టర్‌ శశాంక వివరించారు.

ఇదీ చూడండి:కేరళ విమాన ప్రమాద దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details