తెలంగాణ

telangana

ETV Bharat / state

'మిడ్ మానేరు లింక్ కెనాల్​తో భూములు సస్యశ్యామలం' - mla sathish kumar visited chigurumamidi

కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్​లోని మిడ్​ మానేరు లింక్​ కెనాల్​ను, చిగురుమామిడి-సైదాపూర్​ మండలాల్లోని కుడి కాలువ నిర్మాణ పనులను కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్​తో కలిసి భూములు కోల్పోయిన నిర్వాసితులతో మాట్లాడారు.

collector shashanka and mla sathish kumar inspected mid maneru link canal works
మిడ్ మానేరు లింక్ కెనాల్​తో భూములు సస్యశ్యామలం

By

Published : Jun 4, 2020, 5:00 PM IST

కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలంలో కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పర్యటించారు. ఓగులాపూర్​లోని మిడ్​ మానేరు లింక్ కెనాల్, చిగురుమామిడి-సైదాపూర్​ కుడి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.

చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో లింక్ కెనాల్​ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు తమకు పరిహారం అందలేదని కలెక్టర్, ఎమ్మెల్యేలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా భూనిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

లింక్ కెనాల్​ పనులను అడ్డుకోకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే సతీశ్ కోరారు. మిడ్ మానేరు లింక్ కెనాల్​ పూర్తయితే చిగురుమామిడి, సైదాపూర్​ మండలాలతో పాటు మానకొండూర్​ మండలంలోని 70 వేల ఎకరాలకు గోదావరి జలాలు అంది భూములు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details